25 వరకు బీమా సేవలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

25 వరకు బీమా సేవలు బంద్‌

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

చిత్తూరు కార్పొరేషన్‌ : తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడనున్నట్లు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కిరణ్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు సేవలు నిలిచిపోనున్నట్లు వెల్లడించారు. ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధునికీకరణ పనుల కారణంగా అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. ఆ రోజుల్లో ఎటువంటి బీమా సేవలు అందవని ఈ నెల 26 నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని, పాలసీదారులు మార్పును గమనించాలని కోరారు.

తగ్గిన టమాట ధర

వి.కోట: వి.కోట మార్కెట్‌లో టమాట ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం మార్కెట్లో టమాట 18 కిలోల బాక్సు రూ.50 నుంచి అత్యధికంగా రూ.350 పలికింది. పంటకు ఎరువులు, పురుగుమందులు , కోసే కూలీలు ఖర్చులు పెరిగిపొవడంతోపాటు మార్కెట్‌కు తరలించే ఆటో బాడుగలు కలిపితే నష్టాలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడంత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మార్కెట్లో ధరల ిస్థిరీకరణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

లడ్డూ పోటు తనిఖీ

కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ లడ్డూ పోటును ఈఓ పెంచల కిషోర్‌ శనివారం తనిఖీ చేశారు. ఇటీవల శ్రీకాళహస్తి ఆలయంలో సంభవించిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఈఓ, లడ్డూ తయారీ కేంద్రంలోని అగ్నిమాపక పరికరాల పనితీరును, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై ఆరా తీసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో ఆలయ సూపరింటెండెంట్‌ దివాకర్‌ రెడ్డి, ఎలక్ట్రికల్‌ ఏఈ పవన్‌ పాల్గొన్నారు.

అన్వేషణ సౌత్‌జోన్‌ విజేత ఎస్వీయూ

తిరుపతి సిటీ: హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సౌత్‌ జోన్‌ విద్యార్థి పరిశోధన సదస్సు (దక్షిణ మండలం) అన్వేషణ – 2026లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం చరిత్ర సృష్టించి అగ్రస్థానం స్థానంలో నిలిచింది. వర్సిటీ కల్చరల్‌ అఫైర్స్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ పత్తిపాటి వివేక్‌ ఆధ్వర్యంలోని ఎస్వీయూ విద్యార్థుల బృందం ఈ కార్యక్రమంలో మూడు బహుమతులు గెలుచుకుని దక్షిణ మండల విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా వర్సిటీ ఉప కులపతి డా.నర్సింగరావు, రెక్టార్‌ ఆచార్య చండ్రాయుడు, రిజిస్ట్రార్‌ ఆచార్య భూపతినాయుడు, కల్చరల్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ ఆచార్య మురళీధర్‌ విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ అన్వేషణ పోటీలో హిమాకర్‌, మధుసూదన్‌, వెంకట మౌనిషా బృందం ప్రాథమిక సైన్స్‌ విభాగంలో స్కేర్‌ క్రో 2.0 అనే అంశంపై, శాలిని, సమీరాలు ఇంజినీరింగ్‌ టెక్నాలజీ విభాగంలో మహిళల భద్రత (స్మార్ట్‌వాచ్‌)పై, సానియాబాయి సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలలో సత్తా చాటారు. కాగా ఎస్వీయూ చరిత్రలో పరిశోధన సదస్సుల్లో ఆగ్రస్థానంలో నిలవడం ఇదే ప్రథమంగా వర్సిటీలో అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తుల తో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,124 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వా మిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement