రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

పలమనేరు : పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలు.. రామకుప్పానికి చెందిన యశ్వంత్‌(26) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్థానిక జిమ్‌ సెంటర్‌ వద్ద బైక్‌ఐ వేగంగా వస్తూ ఎదురుగా ఆటోను ఢీకొని, పక్కనే ఉన్న మరో బైక్‌ను సైతం ఢీకొట్టి పడిపోయినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రమాదంలో యశ్వంత్‌ మరణించగా, మరో బైక్‌పై వస్తున్న చైతన్య అనే వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆడిట్‌ బహిష్కరణకు నోటీసులు

చిత్తూరు కలెక్టరేట్‌ : స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంట్ల ఆడిట్‌ను తక్షణమే వాయిదా వేయాలని ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్‌ మణిగండన్‌ కోరారు. శనివారం ఈ మేరకు డీఈఓ లక్ష్మీనారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకరమణకు ఆడిట్‌ బహిష్కరణ నోటీసులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాల పరీక్షలు, పేపర్‌ వాల్యూషన్‌, ఎన్నికల విధుల ఒత్తిడిలో ఉన్న తరుణంలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ అకౌంట్ల ఆడిట్‌ షెడ్యూల్‌ను జారీచేయడం తగదన్నారు. వెంటనే షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కోరినప్పటికీ, సమగ్ర శిక్ష అధికారులు నిరంకుశంగా ఆడిట్‌ నిర్వహిస్తుండడం దారుణమని మండిపడ్డారు. సమగ్రశిక్ష శాఖ అధికారుల ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ఆడిట్‌ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. స్కూల్‌ గ్రాంట్ల విత్‌డ్రా విధానాన్ని సరళీకరణం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు పదేపదే కోరినప్పటికీ, అధికారులు పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. తమకు నచ్చిన పద్ధతినే ఏకపక్షంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెండర్‌ విధానంలో పనులు పూర్తి చేయించడంఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు జీవీ రమణ, చిట్టిబాబు, గిరిబాబు యాదవ్‌, ముక్తార్‌ అహ్మద్‌, జగదీష్‌, ఎస్పీ బాషా, సదాశివరెడ్డి, చంద్రన్‌, ఢిల్లీ బాబు, అఫ్జల్‌ బాషా, గోపీ పాల్గొన్నారు.

కాలువలో గుర్తు తెలియని మృతదేహం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : మార్కెట్‌యార్డు సమీపంలోని మురుగు కాలువలో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులకు మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.

బొలేరో ఢీకొని వ్యక్తి మృతి

శాంతిపురం : కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి బొలేరో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. మొరసనపల్లెకు చెందిన చంద్రశేఖర్‌(38) బైక్‌లో శాంతిపురం వైపు నుంచి ఇంటికి బయలుదేరాడు. బురడసిద్ధనపల్లె– మొరసనపల్లె క్రాస్‌ మధ్య బొలేరో వాహనం ఢీకొంది. దీంతో చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలిసింది.

అమ్మవారి సేవలో

ఎన్నికల కమిషనర్‌

చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా కుటుంబ సభ్యులతో కలసి శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని, అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement