ముగియనున్న ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ముగియనున్న ప్రస్థానం

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

నిబంధనలకు విరుద్ధంగా 35 లక్షలకిలోల పప్పుకోసం టెండర్ల ఆహ్వానం

కుంటి సాకులు చూపుతూ ఐదు కంపెనీలను అనర్హతగా ప్రకటించిన అధికారి

అధిక ధర కోట్‌ చేసినా తన అనుకూల రెండు కంపెనీలకు టెండర్‌ కట్టబెట్టేయత్నం

పచ్చిశనగపప్పు కిలో ధర మార్కెట్‌లో రూ.71.90పైసలు ఉండగా,

కిలో రూ.82.40 పైసలకు టెండరు వేసిన కంపెనీలకు ఆమోదం

ఈ లెక్కన స్వామివారి ఖజానాకు వాటిల్లనున్న నష్టం సుమారు రూ.3.12 కోట్లు

అక్రమంలో చక్రం తిప్పిన ఇద్దరు కీలక అధికారులలో ఒకరికి భారీ నజరానా

ఇప్పటికే అధికారుల బాగోతంపై టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేసిన ఝార్ఖండ్‌ కంపెనీ

ఏళ్ల తరబడి అనేక సేవలు అందించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్‌ ప్రస్థానం ముగియనుంది.

ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం

వైఎస్సార్‌ సీపీ ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.

గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026

శ్రీవారి సొమ్ముకు ఎసరు!

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి అన్నప్రసాదానికి అవసరమైన పచ్చి శనగపప్పు కొనుగోలులో భారీ అవినీతికి తెరతీసినట్టు తెలుస్తోంది. సుమారు 35 లక్షల కిలోల పచ్చి శనగపప్పు సరఫరాకు సంబంధించి అధిక ధర కోట్‌ చేసిన సంస్థలకు ఆమోదం తెలిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే స్వామివారి సొమ్ము సుమారు రూ.3.12 కోట్లు పప్పుబెల్లంలా మారే అవకాశం ఉందని బిడ్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చిశనగపప్పు టెండరులో అబద్ధాలు..!

సాధారణంగా పచ్చిశనగపప్పు, ఇతర దినుసుల సరఫరా కోసం టీటీడీ మూడు నెలలకు ఒకసారి టెండర్లు ఆహ్వానిస్తుంది. టీటీడీ నిత్యావసర సరుకుల సరఫరా విభాగంలోని ఓ అధికారి ప్రస్తుతం 20 రోజుల వరకే స్టాకు ఉందంటూ ఈ నెల 18న పచ్చిశనగపప్పు కోసం టెండర్లు ఆహ్వానించారు. చైన్నె–2, హైదరాబాదు, వినుకొండ–2, ఝార్ఘండ్‌, అనంతపురంలకు చెందిన ఏడు కంపెనీలు 35 లక్షల కిలోల పచ్చిశనగపప్పు సరఫరా కోసం టెండరు వేసినట్లు తెలుస్తోంది. ఆ అధికారి వివిధ కారణాలు చూపుతూ బిడ్డు వేసిన ఐదు కంపెనీలను అనర్హత కింద రద్దు చేశారు. నిబంధనల ప్రకారం టెండరుదారులను అనర్హతగా ప్రకటిస్తే తిరిగి టెండరు పిలవాలి. కానీ ఆ అధికారి తనకు అనుకూలమైన రెండు కంపెనీలకు మాత్రమే టెండరు ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.

అధిక ధరకు టెండరు ఖరారు..

సాధారణంగా తక్కువ ధర కోట్‌ చేసిన వారికే టీటీడీ టెండరు ఖరారు చేస్తుంది. అయితే ఇక్కడ ఎక్కువ ధర కోట్‌ చేసిన వారికి ఆమోదం తెలపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పచ్చిశనగపప్పు కిలో ధర మార్కెట్‌లో రూ.71.90పైసలుగా ఉంది. అయితే అనంతపురానికి చెందిన ఓ కంపెనీ, హైదరాబాదుకు చెందిన మరో కంపెనీ రూ.82.40పైసలకు టెండరు వేసినట్లు సమాచారం. ఈ రెండు కంపెనీలలో ఒకదానికి 65 శాతం, మరోదానికి 35 శాతం చొప్పున పచ్చిశనగపప్పు సరఫరాకు ఆమోదం తెలిపింది.

టీటీడీ ఈఓకు సైతం ఫిర్యాదు

పచ్చిశనగపప్పు సరఫరా టెండరు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టలేదంటూ ఝార్ఖండ్‌కు చెందిన సన్‌ హార్వెస్ల్‌ అనే కంపెనీ టీటీడీ ఈఓకు ఈనెల 17వ తేదీన మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. అన్ని అర్హత పత్రాలను అందజేసినా, స్కోప్‌ సర్టిఫికెట్‌ లేదంటూ అకారణంగా తమ టెండరును అనర్హతగా ప్రకటించినట్లుగా లేఖలో పేర్కొంది.

విచారణకు డిమాండ్‌

శ్రీవారి అన్నప్రసాదానికి సంబంధించిన ముడి సరుకుల కొనుగోలులో పారదర్శకత అత్యంత కీలకం. కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ వ్యవహారంలో టెండర్‌ నిబంధనలు, బిడ్‌ వివరాలు, ధరలు, టెండర్‌ రద్దుకు కారణాలు, ఫైల్‌ నోట్‌లు, నిర్ణయం తీసుకున్న అధికారుల పాత్ర వంటి అంశాలను బహిర్గతం చేయాలని బిడ్డర్లు కోరుతున్నారు.

రూ.3.12 కోట్ల శ్రీవారి ఆదాయం గోవింద..!

కిలో పచ్చిశనగ పప్పు కిలోధర రూ.71.90ల చొప్పున 35లక్షల కిలోలకు రూ.25.72కోట్లు వ్యయం అవుతోంది. ఈ ధరకు దగ్గరగా ఇతర కంపెనీలు టెండరు వేసినట్లు సమాచారం. అయితే ఆ అధికారి కిలో పప్పును రూ.82.40ల చొప్పున సరఫరా చేసే కంపెనీలకు ఆమోదం తెలపడంతో టీటీడీ రూ.28.84 కోట్లు చెల్లించనుంది. అంటే సుమారు రూ.3.12 కోట్లు అదనంగా టెండరుదారులకు చెల్లించడం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ తతంగం వెనుక టీటీడీలో ఇద్దరు అధికారులు కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. ఓ ఉన్నతాధికారికి భారీగా నజరానా అందించినట్లు సమాచారం. ఈ టెండరు ప్రక్రియలో గత ఆరు నెలలుగా పప్పు సరఫరా చేస్తున్న రెండు కంపెనీలు సైతం పాల్గొన్నట్టు తెలిసింది. ల్యాబ్‌ టెస్టు రిపోర్టులతో పాటు మిథాలియన్‌ యల్లో పారామీటర్‌ రిపోర్టులను కూడా ఆ కంపెనీలు టీటీడీకి అందజేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఆ రెండు కంపెనీల టెండరులను అనర్హతగా ప్రకటించడంతో అవినీతి జరిగినట్టు అర్థమవుతోంది.

టీటీడీలో పచ్చిశనగపప్పు కొనుగోల్‌మాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement