డిపార్ట్‌మెంటల్ పరీక్షల తరహాలోనే ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కేటగిరీలతో సంబంధం లేకుండా 150 మార్కులకు గానూ 40 శాతం (60 మార్కులు) మాత్రమే క్వాలిఫైయింగ్ మార్కులుగా నిర్ణయించాలి.
ఉపాధ్యాయులు ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్న నిర్దిష్ట సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇచ్చేలా సిలబస్ సవరించాలి.
ఆన్‌లైన్ విధానానికి స్వస్తి చెప్పి, పాత పద్ధతిలో ఆఫ్‌లైన్ ద్వారానే పరీక్ష నిర్వహించాలి.
సుదీర్ఘకాలంగా అందిస్తున్న వృత్తిపరమైన సేవలు, పొందిన శిక్షణ, వయోభారాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి.
మినహాయింపులు ఇవ్వని కూటమి సర్కారు నోటిఫికేషన్‌లో లేని ప్రత్యేకత డిపార్ట్‌మెంట్ పరీక్షల తరహాలో పాస్ మార్కులు పెట్టాలని టీచర్ల డిమాండ్ తమిళనాడును చూసి నేర్చుకోవాలని హితవు
చిత్తూరు కలెక్టరేట్ : సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి దశాబ్దాల తరబడి పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ (సీనియర్) ఉపాధ్యాయులపై కూటమి సర్కారు టెట్ భారం మోపుతోంది. అక్టోబర్ 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌లో ఇన్ సర్వీస్ టీచర్లకు ఎలాంటి మినహాయింపు కల్పించని దుస్థితి. దీంతో అయ్యోర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా విధుల్లోకి వచ్చే అభ్యర్థులతో సమానంగా సీనియర్లను కూడా చూడడం దారుణమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. స్పెషల్ టెట్ మార్గదర్శకాలను సవరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట నిరసనలు చేపడుతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి సంఘాలు పిలుపునిచ్చాయి.
ప్రత్యేకత లేని ప్రత్యేక టెట్
పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పెషల్ టెట్ అని పేరు పెట్టినప్పటికీ, అందులో ఎలాంటి ప్రాధాన్యత గానీ, మినహాయింపులు లేకపోవడంతో సీనియర్ టీచర్లు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. నిబంధనల ప్రకారం ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు ఉత్తీర్ణత ప్రమాణంగా నిర్ణయించారు. వయోభారంతో పాటు సుదీర్ఘకాలంగా బోధనా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాము అన్ని మార్కులు సాధించడం కష్టమని అయ్యోర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించడం వల్ల సాంకేతిక సమస్యలతో నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు సర్కారు తీర్మానం
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో స్పెషల్ టెట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2010 ఆగస్టు 23కు ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నుంచి పూర్తి, శాశ్వత మినహాయింపు ఇవ్వాలని, ఇందుకు ఆర్టీఈ చట్టంలో అవసరమైన మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు సర్కారు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఉపాధ్యాయ సంఘాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కూటమి సర్కారు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న టీచర్ల భద్రత, జీవనోపాధి, ఉద్యోగోన్నతులను కాపాడాల్సిన అవసరాన్ని తమిళనాడు ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని కూటమి సర్కారు తీర్మానం ఎందుకు చేయడం లేదంటూ మండిపడుతున్నారు.
అయ్యోర్ల డిమాండ్లు ఇవే


