చిత్తూరు అర్బన్: చిత్తూరులోని సైబర్ సెల్, సోషల్ మీడియా విభాగాల పనితీరును ఎస్పీ తుషార్ డూడీ గురువారం తనిఖీ చేశారు. చిత్తూరు నగరంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రెండు కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఆన్‌లైన్ మోసాలు, తప్పుడు మీడియా అకౌంట్లు, ఓటీపీ మోసా లపై ప్రజలు పోగొట్టుకున్న నగదును ఫ్రీజ్ చేయిండంపై అప్పటికప్పుడు దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఇక సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించాల్సిన బాధ్యత కూడా సిబ్బందిపై ఉందన్నారు. ఎస్పీ వెంట ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్, మురళి సిబ్బంది ఉన్నారు.


