తుడా నుంచి తొలగింపుపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

తుడా నుంచి తొలగింపుపై ఆగ్రహం

Aug 19 2026 12:24 AM | Updated on Aug 19 2026 12:24 AM

వెదురుకుప్పం : జీడీనెల్లూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రత్యేక చొరవ తీసుకుని కార్వేటినగరం, వెదు రుకుప్పం మండలాలను తుడా పరిధిలోకి తీసుకువచ్చారని జెడ్పీటీసీ సభ్యుడు సుకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని ఈ రెండు మండలాలను కుట్రపూరితంగా కూటమి నేతలు తుడా పరిధి నుంచి తొలగింపజేశారని మండిపడ్డారు. మంగళవారం వారు మాట్లాడు తూ కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరు పతి జిల్లాలో కలుపుతామని చంద్ర బాబు హామీ ఇచ్చి అమలు చేయకపోగా తుడా నుంచి తొలగించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హ యాంలో తుడా నిధులతో పచ్చికాపల్లం, నల్లవెంగనపల్లె, బొమ్మయ్యపల్లె గ్రామాల్లో రూ. 35 లక్షల చొప్పున వెచ్చించి కమ్యూనిటీ హాళ్లు నిర్మించినట్లు వెల్లడించారు. రూ.కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ, జనసేన నేతలు పని గట్టుకుని కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలంటూ ధర్నాలు, ఆందోళనలు చేపట్టి నాటకా లు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఈ ఆంశాన్నే ఆయుధంగా వాడుకున్న కూటమి నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లో నారాయణస్వామిపై బురదజల్లి ఓట్లు వేయించుకున్న కూట మి నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం మీ నైజమని, ఇప్పుడిప్పుడే మీ మో పాలు, అన్యాయాలు, అరాచకాలను ప్రజలు తెలుసుకుంటున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, బూత్‌ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ, సోషల్‌ మీడియా విభాగం మండల అధ్యక్షుడు దేవరాజులు రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement