చిత్తూరు కలెక్టరేట్ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్‌న్స్ పోటీల పోస్టర్‌ను డీఈఓ లక్ష్మీనారాయణ మంగళవారం ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు చెకుముకి సైన్స్ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు హెచ్.అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. పాఠశాల స్థాయిలో ఈ నెల 27వ తేదీన, జిల్లా స్థాయిలో సెప్టెంబర్ 27వ తేదీ, రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన పోటీలు ఉంటాయని వివరించారు. పూర్తి వివరాలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జేవీవీ కార్యకర్తలను సంప్రదించాలని కోరారు. జేవీవీ నగర అధ్యక్షుడు సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు జయంతి, విజయ్ కుమార్, బాలయ్య, ఉమాపతి, యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రమణ, అధ్యక్ష కార్యదర్శులు రెడ్డెప్ప, మణిగండన్, నరేంద్ర, హరీష్ పాల్గొన్నారు.


