కార్వేటినగరం : తండ్రి అంత్యక్రియలకు కుమారుడు నిరాకరించడంతో కుమార్తె తల కొరివిపెట్టిన ఘటన మండలంలోని పొన్నగల్లులో మంగళవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(65), శాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెళ్లి చేసుకుని అత్తవారి ఇంట్లో ఉంటున్నారు. ,కుమారుడు చైన్నెలో ఉంటున్నాడు. 15 ఏళ్లక్రితం శాంతమ్మ మృతిచెందినప్పటి నుంచి వెంకటేశ్వర్లు కల్లుగీత పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఆలనపాలన లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతూ వెంకటేశ్వర్లు ఆధివారం మరణించాడు. తండ్రి మృతిపై కుమారుడికి సమాచారం అందించినా రాలేదు. తనకోసం ఏమీ ఆస్తులు కూడబెట్టలేదని, తలకొరివి కూడా పెట్టనని స్పష్టం చేశాడు. దీంతో పెద్దకుమార్తె నాగరత్నమ్మ తన తండ్రికి కొరివిపెట్టి జన్మనిచ్చిన రుణం తీర్చుకుంది.


