చిత్తూరు
జిల్లాలో జోరుగా నకిలీ మందుల విక్రయాలు
7
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026
జిల్లాలో మెడికల్ మాఫియా పేట్రేగిపోతోంది. ఔషధాల మాటున యథేచ్ఛగా దందా నడిపిస్తోంది. బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులను తయారు చేసి అమ్మేస్తున్నారు. అలాగే నాణ్యత లేని.. కాలం చెల్లినవాటిని సైతం ప్యాకింగ్ మార్చేసి విక్రయించేస్తున్నారు. చివరకు ప్రాణాలు కాపాడాల్సిన మందులను కాసుల కక్కుర్తితో విషతుల్యంగా మార్చేస్తున్నారు. లోగట్టు తెలియని సామాన్యులు కాస్త తలనొప్పి వచ్చినా.. జ్వరం సోకినట్లు అనిపించినా వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి చీటీ లేకుండానే మాత్రల పేరుతో అనార్యోగం కొని తెచ్చేసుకుంటున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన డ్రగ్స్ కంట్రోల్‌శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. తనిఖీలను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.


