విభజనకు అడుగులు | - | Sakshi
Sakshi News home page

విభజనకు అడుగులు

Aug 18 2026 7:34 AM | Updated on Aug 18 2026 7:34 AM

● మూడు ముక్కలుగా జిల్లా పరిషత్‌ ● అవతరించనున్న చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జెడ్పీలు ● ఉద్యోగుల నుంచి ఆప్షన్ల ఆహ్వానం ● సెప్టెంబర్‌ 25 తర్వాత ప్రక్రియ పూర్తికి సన్నాహాలు

చిత్తూరు కార్పొరేషన్‌ : చిత్తూరు జిల్లా పరిషత్‌కు విశిష్టమైన చరిత్ర ఉంది. 1959లో సమితులు, తాలూకా లు, జిల్లా బ్లాక్‌ బోర్డుల ఆధారంగా జెడ్పీ వ్యవస్థ ఆవిర్భవించింది. అనంతరం 1983లో మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజాపరిషత్‌ వ్యవస్థకు రూపుదిద్దుకోగా, 1986 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. 2021 సెప్టెంబర్‌ 25న జరిగిన జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో గోవిందప్ప శ్రీనివాసులు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన నేతత్వంలోని పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌ 24తో ముగియనుంది. దీంతో ఉమ్మడి జిల్లాపరిషత్‌కు తెరపడనుండగా.. మూడు కొత్త జెడ్పీలు అధికారికంగా ఏర్పాటుకానున్నాయి.

సీనియారిటీ జాబితా తయారీ

జెడ్పీ పరిధిలో వివిధ కేటగిరీల కింద మొత్తం 650 మంది ఉదోగ్యులున్నారు. ఇందులో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు 130 మంది, ఏఓలు 79 మంది, సీనియర్‌ సహాయకులు 135 మంది, జూనియర్‌ సమాయకులు, టైపిస్టులు 350, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్‌మన్లు, డ్రెవర్లు 275 మంది ఉన్నారు. జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌, ఇతర పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సీనియారిటీ జాబితాల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్స్‌ అనుగుణంగా ఉద్యోగి విధుల్లో చేరిన తేదీ, అర్హత లు, కేడర్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసు కుని సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. ఈ జాబితాల ఆధారంగానే కొత్త జిల్లా పరిషత్‌లకు ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు చేపట్టనున్నారు. ఈమేరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. రానున్న 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సుదీర్ఘ చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లా పరిషత్‌ను త్వరలోనే విభజించనున్నారు. గతంలో చేపట్టిన జిల్లాల డీలిమిటేషన్‌ ఆధారంగా జెడ్పీని మూడుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌) అమల్లోకి రావడంతో.. సెప్టెంబర్‌ 25 తర్వాత మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందదులో భాగంగా జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌ స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేశారు. సీనియారిటీ ప్రాతిపదికన పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం చేశారు.

ఎన్నికలకు సన్నాహాలు

2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జిల్లాల పునర్‌ వ్యవస్థకీరణలో భాగంగా ఉమ్మడి జిల్లాను చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే అప్పట్లో జిల్లాపరిషత్‌ల విభజన జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో జెడ్పీల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో కొత్త జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం నిష్పత్తులను ఖరారు చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement