రెండిళ్లలో చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

రెండిళ్లలో చోరీకి యత్నం

Aug 18 2026 7:34 AM | Updated on Aug 18 2026 7:34 AM

– ఇద్దరు నిందితుల పట్టివేత

శ్రీరంగరాజపురం : మండలంలోని సీకేపురం, చిన్నతయ్యూరులోని రెండిళ్లలో ఆదివారం రాత్రి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు చోరీకి యత్నించారు.స్థానికులు అప్రమత్తం కావడంతో బైక్‌పై పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కింద పడిపోవడంతో పట్టుబడ్డాడు. మరొకరిని స్థానికులు సురేష్‌, ప్రభాకర్‌ వెంటపడి పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే పోలీసు స్టేషన్‌ 9440900692 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. అలాగే బైక్‌పై నుంచి కిందపడిన నిందితుడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

తిరుమల: గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్‌ స్వామి, చినజీయర్‌ స్వామి, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి పాల్గొన్నారు.

ఆస్పత్రిలో చికిత్స

పొందుతున్న నిందితుడు

పోలీసు అదుపులో మరో నిందితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement