రాష్ట్రస్థాయి పోటీలకు ‘కేడీసీ’ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ‘కేడీసీ’ విద్యార్థులు

Aug 18 2026 7:34 AM | Updated on Aug 18 2026 7:34 AM

కుప్పంరూరల్‌ : రాష్ట్రస్థాయి అమరావతి చాంపియన్‌ షిప్‌ పోటీలకు కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు 10 మంది ఎంపికై నట్లు కళాశాల వైస్‌ చైర్మన్‌ సాగర్‌రాజ్‌ తెలిపారు. ఖోఖోలో కె.దర్శిని, ఎస్‌.పూజ, ఎం.రమ్య, వెయిట్‌ లిప్టింగ్‌లో వి.నరేంద్రదారి, వీఎం ఆదర్శ్‌, వాలీబాల్‌ విభాగంలో ఆర్‌. ఇందుశ్రీ ఎంపికై నట్లు చెప్పారు. అథ్లెటిక్‌ విభాగంలో వి.అర్చన, జీఎస్‌ మోనిష్‌, కె.సుదర్శన్‌, పీజే అరుణ్‌ ఎంపికై నట్లు వెల్లడించారు. సోమవారం ఈ మేరకు విద్యార్థుల, పీడీ సుధాకర్‌ను ప్రిన్సిపల్‌ డి.సుధారాణి అభినందించారు.

టెంపో ఢీకొని యువకుడి దుర్మరణం

వి.కోట: మండలంలోని పలమనేరు–వి.కోట జాతీయ రహదారిపై నెర్నిపల్లె సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. యాలకల్లు పంచాయతీ వైసీ బండపల్లెకు చెందినఅబ్దుల్‌ రెహ్మన్‌ (27) బైక్‌పై పెట్రోల్‌ బంక్‌కు వెళ్లాడు. అదే సమయంలో డీజిల్‌ కోసం వచ్చిన టెంపో ఓ ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి రెహ్మాన్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెహ్మాన్‌ అక్కడికక్కడే మరణించాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన టెంపో సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement