చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కా రం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారి పై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
నల్ల రిబ్బన్లతో
నిరసన తెలపండి
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా విధులకు నల్ల రిబ్బన్లతో తమ నిరసన తెలుపాలని వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం టెట్ మినహాయింపు కోరుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రికి వినతి పత్రం అందజేసిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. సస్పెన్స్‌లను ఎత్తివేసి వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వివరణ సైతం అడుగక ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టిన కడప డీఈఓ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


