ఎలా సాకేది దేవుడా! | - | Sakshi
Sakshi News home page

ఎలా సాకేది దేవుడా!

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

వేటగాళ్ల ఉచ్చుకు బలైన కుటుంబ యజమాని

అనాథలైన నలుగురు బిడ్డలు

కన్నీరుమున్నీరవుతున్న

బంధువులు

బంగారుపాళెం: ‘మాటలు రాని కూతుర్ని అల్లారు ముద్దాగా చూసుకున్నావు.. పిల్లలపై చిన్న ఈగ వాలకుండా పెంచుకున్నా వు. ఇప్పుడు వాళ్లందర్నీ దూరం చేసి వెళ్లా వు. నువ్వులేకుండా వాళ్లు ఎలా బతుకుతా రు. నేను ఎలా సాకగలను దేవుడా..! అంటూ మృతుడు చిన్నస్వామి భార్య భారతి గుండెలు పగిలేలా రోదించడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది. ఆవునువెతుక్కుంటూ వెళ్లిన ఓ కుటుంబ యజమాని వేట గాళ్ల ఉచ్చుకు బలవ్వగా.. అతని మృతితో నలు గురు బిడ్డలు, భార్య అనాథలై రోడ్డన పడ్డా రు. ఈ విషాద ఘటన మండలంలోని గుంతూరు అటవీ సరిహద్దులో గల ఓ మామిడితోటలో చోటు చేసుకుంది. వివరాలు.. గుంతూరు యానాది కాలనీకి చెందిన చిన్నస్వామి(40)కి భార్య భారతి, ఇద్దరు మగపిల్లలు ధనంజయ(12), హరికృష్ణ (11), ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) కావ్య (7), కావ్యశ్రీ(7) ఉన్నారు. కావ్యశ్రీ దివ్యంగురాలు. మాట లు రావు. చిన్నస్వామికి రెండు ఎకరాలు మెట్ట భూమి (డీకేటీ) ఉంది. అందులో నీటి వసతి లేకపోవడంతో పంటలు పండవు. మూడు పాడి ఆవులను మేపుకుంటూ.. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఆవును వెతుక్కుంటూ వెళ్లి

శనివారం పాడి ఆవుల్లో ఒకటి మేతకు తీసుకువెళ్లిన క్రమంతో తప్పిపోయింది. సాయంత్రం ఆవును వెతుక్కుంటూ నరసింహులునాయుడు మామిడితోట వైపు చిన్నస్వామి వెళ్లాడు. అక్కడ గుర్తుతెలియ ని వేటగాళ్లు అడవి జంతువుల కోసం అమర్చిన కరంటు తీగకు కాలు తగులుకుని చిన్నస్వామి మృతి చెందాడు. చిన్నస్వామి గ్రామంలో ఎవరు కూలి పనులకు పిలిచినా వెళ్లే వాడని, చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి అకాలంగా మృతి చెందడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు. మృతి చెందిన చిన్నస్వామి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆవును వెతుక్కుంటూ.. అనంతలోకాలకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement