చిత్తూరు అర్బన్: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాత నేరస్తుడిపై చిత్తూరు పోలీసులు పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్) నమోదు చేశారు. నగరంలోని అశోకపురం ప్రాంతానికి చెందిన అల్లా బకా ష్ అలియాస్ షేక్ బకాస్ (36)పై ఈ కఠిన చర్యలు తీసుకు న్నట్లు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. పోలీసుల కథనం ప్రకా రం... అల్లా బకాష్‌పై చిత్తూరు వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్లలో దాదాపు ఆరు గంజాయి విక్రయాల కేసులు నమోదై ఉన్నాయి. గతంలో పలుమార్లు ఇతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వహించినా, ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపో గా గంజాయి స్మగ్లింగ్‌ను కొనసాగించాడు. నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని కోరుతూ పోలీసులు జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదికను సమర్పించారు. నివేదిక పరిశీలించిన కలెక్టర్ పీడీ యాక్ట్ నమోదుకు అనుమతించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమో దు చేసి, ఆదివారం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ...యువతచెడు సావాసాలు, మాదకద్రవ్యాల రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.


