స్వేచ్ఛా గీతిక | - | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛా గీతిక

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

● పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ● అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ● జెండా ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ● ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేత ● సంజీవని ప్రాజెక్ట్‌ను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం డిజిటలైజేషన్‌ వ్యవస్థలో ఒక ఆదర్శవంతమైన నమూనాగా నిలుస్తోందన్నారు. ● ఎన్‌టీఆర్‌ వైద్య సేవా పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43.6 కోట్ల ఖర్చుతో 21,977 మందికి శస్త్ర చికిత్సలు అందించామన్నారు. ● చిత్తూరు, తచ్చూరు 6 లైన్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌లో సురక్షిత రవాణ సౌకర్యానికి రూ.3,210 కోట్లతో 116 కి.మీ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ● సీడ్‌ క్యాపిటల్‌ పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 384 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున రూ.1.49 కోట్లు మంజూరు చేశామన్నారు. ● చిత్తూరు, కుప్పం మండలాల్లో కేంద్రీయ విద్యాలయాలకు 18 ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు. ● జిల్లాలో 23.8 కోట్ల పెట్టుబడితో 1167 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రారంభించి దాదాపు 6 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. ● అన్నదాత సుఖీభవ పథకంలో మూడు విడతల్లో 1,78,622 మందికి రూ.85.62 కోట్లు, పీఎం కిసాన్‌ లో 1,42,109 మందికి రూ.28.42 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

జిల్లా అంతటా

రెపరెపలాడిన త్రివర్ణపతాకం

పట్టపగలు మూడు రంగుల వెన్నెల కురిసింది. వందేమాతరం అని విన్న ప్రతిసారీ జనం గుండె ఝల్లుమంది. జనగణమన జన గళమున సగర్వంగా పలికింది. జిల్లాలోని పోలీస్‌

పరేడ్‌ మైదానంలో శనివారం 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. విద్యార్థుల ప్రదర్శనలు, శకటాల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుతో ఉత్సవం ఉత్సాహంగా సాగింది.

చిత్తూరు కలెక్టరేట్‌ : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ అన్నారు. 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దళాల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసు వాహనంపై మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ కవాతు చేపట్టారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు. ఎందరో నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరిస్తూ.. ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు.

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సత్యకుమార్‌యాద వ్‌ అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పీ4 కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

మంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలివీ..

ఆకట్టుకున్న డాగ్‌ షో

పోలీస్‌ డాగ్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లూస్‌ టీంలో కీలక పాత్ర పోషించే డాగ్స్‌ తమ విన్యాసాలతో ఆహుతులను ఆకట్టుకున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని రేకెత్తించాయి. చిన్నారుల నుంచి ఉన్నత పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్‌, మురళీమోహన్‌, చుడా చైర్మన్‌ కటారి హేమలత, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, ఎస్పీ తుషార్‌ డూడి, జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, కడా పీడీ వికాస్‌ మర్మత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌, డీఆర్వో మోహన్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement