తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,699 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,884 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమ ర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్ర వేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది.
సోలార్ విద్యుత్తుకు పెద్దపీట
తిరుపతి రూరల్: ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలో సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. శనివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల 2.07 లక్షల గృహాలపై 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 1.06 లక్షల గృహాల్లో 214 మెగావాట్ల మేర ఏర్పాటు చేసినట్లు తెలి పారు. కుప్పం నియోజకవర్గంలో 39,215 బీసీ గృహాలకు 78.43 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలా ర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ద్వారా 1.35 లక్షల పంపు సెట్లకు 610 మెగావాట్ల సౌర విద్యుత్ అందించే పను లు జరుగుతున్నాయని చెప్పారు. వినియోగ దారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం 62 నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టామని, 13.20 లక్షల స్మార్ట్ మీటర్ల లక్ష్యంలో ఇప్పటికే 10.74 లక్షలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు
సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బెస్ట్ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ తదితర విభాగాల్లో సీఎండీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
ఎంపీ మిథున్‌రెడ్డి
అయ్యప్ప మాల ధారణ
తిరుపతి కల్చరల్: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. ఈ మేరకు శ్రీకపిలేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని పుణ్యస్నానం ఆచరించి ఆలయ అర్చకుడిచేత అయ్యప్ప స్వామి వారి దీక్ష మాల స్వీకరించారు. అనంతరం శ్రీకపిలేశ్వరస్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.


