జెండాకు వందనం | - | Sakshi
Sakshi News home page

జెండాకు వందనం

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

చిత్తూరు(కార్పొరేషన్‌): 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో చైర్మన్‌ శ్రీనివాసులు శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సాధనకు ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో సీఈఓ రవికుమార్‌ నాయడు జెడ్పీటీసీ సభ్యురాలు భారతి పాల్గొన్నారు. అలాగే జిల్లా క్లాస్‌–4 ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి లోకనాధం, కోశాధికారి రామచంద్రయ్యలు పాల్గొన్నారు. అదేవిధంగా సీపీఐ, సీపీఎం కార్యాలయాల్లో జిల్లా కార్యదర్శి గంగరాజు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ అమర్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ భవనంలో గురువారెడ్డి జెండాకు వందనం చేశారు.

కాణిపాకం ఆలయంలో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఈవో కార్యాలయం వద్ద శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈవో పెంచల కిషోర్‌ జెండా ఎగురవేసి వందనం చేశారు. కార్యక్రమంలో ఏఈవో హరి మాధవరెడ్డి, సిబ్బంది వాసు, దివాకర్‌రెడ్డి, పండితులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని డీసీసీబీ కార్యాలయంలో సీఈవో శంకరన్‌, చైర్మన్‌ అమాసరాజశేఖర్‌రెడ్డి మూడు రంగుల జెండాను ఎగురవేసి రెపరెపలాడించారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ మనోహర్‌గౌడ్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ లల్లీ కేథరిన్‌, వెంకటాచలపతి, సురేష్‌బాబు పాల్గొన్నారు.

జిల్లా న్యాయస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవం

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక జెండా ఎగురవేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శంకర నాయుడు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులతో కలిసి అరుణ సారిక మొక్కలు నాటారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, ఇతర న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement