– బాధితురాలి ఫిర్యాదు మేరకు
కేసు నమోదు
గంగవరం: ప్రేమించి మోసం చేయడంతో ఓ యువతి ఫిర్యాదు మేరకు మోసగించిన వ్యక్తిపై గంగవరం పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు మండలంలోని గండ్రాజుపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఆంజి అనే యువకుడు ఇద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఆ యువకుడు తన ప్రేమను నిరాకరించి పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ బాధితురాలు పేర్కొన్నారు. దీంతో ఆమె గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేశారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
గుడిపాల: ట్రాక్టర్ ఢీకొని ఓవ్యక్తి మృతి చెందిన ట్లు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. శనివారం అడవిచేను గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి తన పొలానికి చెరువులో మట్టిని తోలుకుని వెళుతుండగా చెరువు సమీపంలో ఓ ప్రాంతంలో మిట్టగా ఉండడంతో ట్రాక్టర్ ఎక్కలేక వెనక్కు వచ్చేసింది. ఇంతలో వెనుక ద్విచక్ర వాహనంలో అడవిచేను గ్రామానికి చెందిన ఆర్ముగం(65)తన పొలం వద్ద నుంచి వస్తుండగా వెనుకవైపు ఢీకొనడంతో ట్రాక్టర్ టైర్ అతని తల పై ఎక్కడంతో అక్కడే మృతిచెందాడు. కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రెడ్ క్రాస్ సొసైటీ
రక్తదాన కేంద్రం ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన కేంద్రం శనివారం జిల్లా శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్, ఎంవీ కేశవరెడ్డి మెమెరియల్ పౌండేషన్ వ్యవస్థాపకులు ఎంవీ శ్రీధర్‌రెడ్డి రూ.1.30 లక్షలు విలువ చేసే ఎలక్ట్రికల్ బైకును కేంద్రానికి వితరణగా అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, మురళీమోహన్ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు తేజోమూర్తి, ఉపాధ్యక్షులు గోవర్థన్‌బాబి, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
తండ్రిని హత్యచేసిన
తనయుడి అరెస్టు
శ్రీరంగరాజపురం: మద్యం సేవించేందుకు డబ్బు లు ఇవ్వలేదని తండ్రిని హత్యచేసిన కుమారుడిని అరెస్టుచేసినట్లు కార్వేటినగరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హనుమంతప్ప శనివారం తెలిపారు. ఈ సందర్భంగా సీఐ హనుమంతప్ప మాట్లాడుతూ 13వ తేదీ రాత్రి క్షీరసముద్రం గ్రామంలో ఉంటు న్న ఆనంద్‌నాయుడును అతని పెద్ద కుమారుడు జ్యోతీష్ మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కక్షతో ఇంట్లో ఉన్న కత్తితో దారుణంగా పొ డిచి చంపాడని తెలిపారు. అడ్డుకునేందుకు వచ్చి న మేనత్త గీత తలపై కూడా తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. దీంతో వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేయగా శనివారం జ్యోతీష్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐ సుమన్, సిబ్బంది ఉన్నారు.
సంతాపం
చిత్తూరు(కార్పొరేషన్): రాయలసీమ విద్యాసంస్థల అధినేత కొండారెడ్డి మృతిపట్ల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వారు ధైర్యంగా ఉండాలని తెలియజేశారు.


