● కాలి బూడిదైన వంట సామగ్రి ● సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం
పెద్దపంజాణి: అప్పటివరకు కుటుంబానికి ఆశ్రయంగా ఉన్న ఆ పూరిగుడిసె.. ఒక్కసారిగా చెలరేగిన మంటలకు ఆహుతై ఆ కుటుంబాన్ని కట్టు బట్టలతో వీధిన పడేలా చేసింది. ఈ సంఘటన మండలంలోని రాయలపేట గ్రామం కరమలవీధిలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కరమలవీధికి చెందిన కే.సరస్వతమ్మ, కుమారుడు కుమారాచారితో కలసి కూలి పనులు చేసుకుంటూ పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారు. కుమారుడు పనుల నిమిత్తం బయట కు వెళ్లడంతో సరస్వతమ్మ ఇంటి ముందు నిద్రిస్తోంది. ఈ క్రమంలో శనివారం వేకువజాము న ఇంటిపై మంటలు ఒక్కసారిగా వేగంగా వ్యాపించడంతో గుడిసె పైకప్పు, దూలాలు, గోడలు పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో ఉన్న వంట సామగ్రి, పాత్రలు, ఇతర గృహోపకరణాలు సైతం మంటలో చిక్కుకుని కాలిబూడి దయ్యాయి. గుడిసె ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామాగ్రి కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గు రైంది. మంటలు ఎలా చెలరేగాయన్న విష యం తెలియాల్సి ఉండగా, ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆస్తి నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఎక్స్‌ప్రెస్ హైవే పక్కన మంటలు
గుడిపాల: చైన్నె–బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవే ఆనుకుని మంటలు చెలరేగాయి. హైవేని ఆనుకుని అధికారులు పచ్చిగడ్డిని పెంచారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో గడ్డి ఎండిపోయింది. 189కొత్తపల్లె సమీపంలోని ఎక్స్‌ప్రెస్ హైవే ఆనుకొని ఆకతాయిలు అగ్గి పెట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం వాహనాలు పెద్దగా పోవకపోవడంతో ప్రమాదాలు తప్పింది. స్థానికులు గమనించి మంటలను అదుపు చేశారు.


