బంగారుపాళెం: మండలంలోని గాండ్లపల్లెకు చెందిన హేమచంద్రపిళ్లై గత మూడు రోజులుగా కనిపించడంలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. హేమచంద్రపిళ్లె మొగిలి శ్రీనిపుడ్స్ ఆవరణలోని వైవై న్యూడిల్స్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం పనికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లాడని తెలిపారు. మూడు రోజులైనా ఇంటింకి రాకపోవడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిని, బంధువులు, స్నేహితులను విచారించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హేంచంద్రపిళ్లె ఆచూకీ తెలిసిన వారు 9440796736 నంబరుకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు.


