చివరి సమావేశం..తూతూ మంత్రం | - | Sakshi
Sakshi News home page

చివరి సమావేశం..తూతూ మంత్రం

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

● గైర్హాజరైన తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులు ● జెడ్పీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుల ఆగ్రహం

చిత్తూరు కార్పొరేషన్‌ : జెడ్పీ పాలకవర్గం చివరి స్టాండింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులు గైర్హజరవ్వడంతో పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు రాకపోతే ఇంకెవరికి సమస్యలు తెలపాలని, జెడ్పీటీసీ సభ్యులంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 1,2,4,7 స్థాయి సంఘాల సమావేశం జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, 3, 6 స్థాయి సంఘాల సమావేశం వైస్‌ చైర్మన్‌ ధనంజయరెడ్డి, 5వ స్థాయి సంఘ సమావేశానికి సీ్త్ర శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌ భారతి అధ్యక్షతన నిర్వహించారు. సీఈఓ రవికుమార్‌నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, జెడ్పీటీసీ సభ్యు లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య రానివ్వద్దు :

జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

ఉమ్మడి జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు ఆదేశించారు. జెడ్పీ నిధులతో చేపడుతున్న పనులు 50 శాతానికిపైగా పూర్తయింటే వాటికి శిలాఫలకాలు ఏర్పాటు, సంబంధిత జెడ్పీటీసీ సభ్యుల పేర్లు వేసి ఈనెలలోపు ప్రారంభించాలన్నారు. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వాలన్నారు. జిల్లాలోని డ్వామా పరిధిలో రూ.84 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలవుతున్నా ఇస్సటికీ కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు.

సభ్యులు ఏమన్నారంటే

ప్రతి సమావేశంలో మండలాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రావడం లేదని, మండలంలో అధికారులు కనీస గౌరవం ఇవ్వ డం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో నీటి సమస్య ఉందని తెలిపారు. పంచాయతీల్లో కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీవోల పనితీరు సక్రమంగా లేదని విమర్శించారు. గ్రీన్‌ అంబాసిడర్లను ఇష్టారాజ్యంగా పనిలో నుంచి తీసివేస్తున్నారని వాపోయారు.

మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, పాల్గొన్న జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement