జిల్లా స్థాయి ఆదేశాలను బేఖాతరు చేస్తున్న మండల అధికారులు జగనన్న హయాంలోనే ప్రజలకు సమన్యాయం బాబు పాలనలో టీడీపీ నాయకులకే న్యాయం కూటమి పాలనపై మాజీ డిప్యూటీ సీఎం ధ్వజం
కార్వేటినగరం: సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీదారునికి రాజకీయాలకు అతీతంగా న్యాయం జరిగే చూడాలని మాజీ ఉప ముఖ్యమఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి హితువు పలికారు. శుక్రవారం పుత్తూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రజల మనోభావాలను తెలుసుకుని పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో స్పందన కార్యక్రమాన్ని తీసుకొచ్చే పేద ప్రజల సమస్యలను రెండు మూడు రోజుల్లో పరిష్కరించి అండగా నిలిచారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమి ఒకే పార్టీ వారికి మాత్రమే న్యాయం జరిగేలా చేస్తున్నారని ఆరోపించారు.
మండల స్థాయి అధికారుల తీరు దారుణం
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ల సమక్షంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారుల ఆదేశాలను మండలస్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. ఒక్కో కలెక్టర్ ఒక ముఖ్యమంత్రితో సమానమని, ఐఏఎస్ అఽధికారులు ప్రజా ప్రతినిధులకు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ప్రజల సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరిస్తే జిల్లా అధికారులకు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. పేద ప్రజలకు గతీమోక్షం దొరకని స్పందన కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రద్దు చేస్తే బాగుంటుందేమో అని చెప్పారు. ప్రజల మనో వేదనను చోడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


