– ఇద్దరికి గాయాలు
గంగవరం: పలమనేరు వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని బెంగళూరు వైపు వెళ్తున్న మరో బొలేరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి బొలేరో వాహనం పూల లోడుతో రాజమండ్రికి వెళ్తోంది. ఈ క్రమంలో పలమనేరు సమీపంలోని జీఎల్‌ఎస్ ఫారం బ్రిడ్జి వద్ద బెంగుళూరు వైపు వెళ్తున్న మరో బొలేరో వాహనం అతి వేగంగా వెళ్తూ రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటి అవతలి వైపు చింతామణికి పూల లోడుతో వెళ్తున్న బొలేరోను ఢీకొట్టింది. రెండు వాహనాలు పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ముళబాగిల్‌కు చెందిన డ్రైవర్ ఉమేష్(30)కు స్వల గాయాలవగా, క్లీనర్ లక్ష్మీకాంత్(31) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి గాయపడ్డ వారిని బంధువులు కోలార్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బొలేరో డ్రైవర్‌ను అదుపులోకి తిసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రంగా గాయపడ్డ
క్లీనర్ లక్ష్మీకాంత్
స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ఉమేష్


