పెద్దపంజాణి: వన్య ప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని గంకొండ అటవీ ప్రాంత సమీపంలోని కొత్తచెరువు వద్ద గురువారం వేకువజాము న చోటుచేసుకుంది. స్థానికుల కథ నం మేరకు వివరాలు.. పెద్దకాప్పల్లి పంచాయతీ గౌరీనగర్ గ్రామానికి చెందిన యానాది చిన్నస్వామి కుమారుడు నాగరాజ(45) అటవీ ఫలసాయాలు సేకరించి వాటిని విక్రయించగా వచ్చిన నగదుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం వేకువజామున భార్య, కుమారునితో కలసి గంకొండ అటవీ ప్రాంతానికి బయలుదేరా డు. మార్గం మధ్యలోని కొత్త చెరువు వద్ద వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలు చీకటిలో కనిపించక వాటిమీ ద పడడంతో తీవ్రంగా గాయపడ్డా డు. జరిగిన ప్రమాదాన్ని వెనుక వస్తున్న భార్య గుర్తించి గట్టిగా కేక లు వేయడంతో పరిసర ప్రాంతాల్లో ని రైతులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని 108 వాహనంలో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు కుటుంబీకులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. సంఘటన స్థలాన్ని ట్రాన్స్‌కో ఏఈ వెంకట్రమణ, పెద్దపంజాణి పోలీసులు పరిశీలించి విచారణ చేస్తున్నారు.


