ఐరాల: విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన బుధవారం సాయంత్రం మండలంలోని 45 కొత్తపల్లెలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని 45 కొత్తపల్లెకు చెందిన టి.భాస్కర్(48) ఉదయం రోజువారి మాదిరిగానే తమ పాడి ఆవుల మేతకోసం తీసుకెళ్లి, తిరిగి సాయంత్రం పాడి ఆవులతో ఇంటికి వచ్చాడు. స్నానం చేయడానికి వెళ్తూ ప్లగ్‌లో విద్యుత్ వైరు పెట్టుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


