మా భూములను లాక్కోవద్దు | - | Sakshi
Sakshi News home page

మా భూములను లాక్కోవద్దు

Aug 13 2026 1:21 AM | Updated on Aug 13 2026 1:21 AM

– 8లో

భూచోళ్లు
రెవెన్యూ ఉద్యోగులు రికార్డులను తారుమారు చేసి, బోగస్‌ ఎంట్రీలు చేసి జేబులు నింపుకుంటున్నారు.

శాంతిపురం: పరిశ్రమల కోసం తమకు జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కోవద్దని శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీలోని వెంకటాపురం గ్రామస్తులు తహసీల్దార్‌ తనూజను వేడుకున్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తహసీల్దారును కార్యాలయంలో కలిసి తమ గోడును చెప్పుకుని, వినతి పత్రం అందించారు. గ్రామంలోని వడ్డెర కులానికి చెందిన 250 కుటుంబాల వారు ఐదు తరాలుగా ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నామన్నారు. బంజరు, గుట్టలతో ఉన్న భూములను అతి కష్టం మీద సాగుకు అనువుగా అభివృద్ధి చేసుకుని బోర్లు వేసుకున్నామని చెప్పారు. దీనికోసం బ్యాంకుల్లో, బయట అప్పులు చేసి పెట్టుబడి పెట్టామన్నారు. అధికారులు తమకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెంకటాపురం వద్ద 150 ఎకరాలను పరిశ్రమల కోసం తీసుకుంటామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని చెప్పారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న వారి నుంచి భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం అవుతాయన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ తనూజ గ్రామస్తుల అభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement