పురపాలక ఎన్నికల నిర్వహణకు ఆయా మునిసిపాలిటీలు ఇప్పటికే అన్ని రకాల డేటాతో కొలిక్కి వచ్చి ఉండాలి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. చిత్తూరు కార్పొరేషన్‌లో అప్పటివరకు ఉన్న 50 డివిజన్ల స్థానంలో ప్రభుత్వ ఆదేశాలతో పునర్విభజన చేసిన అధికారులు 60 డివిజన్లుగా రూపొందించి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇది ఏమాత్రం హేతుబద్ధకంగా లేదంటూ వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో.. వార్డుల పునర్విభజనకు బ్రేకులు పడ్డాయి. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కేసు కొట్టేయకుండా ఎన్నికలకు వెళ్లడం సాధ్యపడదు.
● పలమనేరులో 26 వార్డుల స్థానంలో 40, నగరిలో 29 వార్డుల స్థానంలో 40 వార్డులను రూపొందించిన అధికారులు నోటిఫికేషన్ కూడా పూర్తిచేశారు. కానీ ఇప్పటివరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా అధికారుల వద్ద సిద్ధంగా లేదు.
● మునిసిపల్ ఎన్నికల పోలింగ్ తేదీకి ముందే, అంటే 30–45 రోజులకు ముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ అలాంటి సంకేతాలు ఏవీ వెలువడలేదు.
● మునిసిపల్ ఎన్నికలకు వార్డుల రిజర్వేషన్ కీలకం. అందులోనూ బీసీ ఓటర్ల లెక్క తేలాలి. ఇవేమీ అధికారుల వద్ద లేవు.


