కుప్పంరూరల్: ద్రావిడ విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభివృద్ది పనులు (రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ 2.0) రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయభాస్కరరావు, నోడల్ అధికారి ప్రొఫెసర్ భూపతినాయుడు, ఎస్వీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ గురవారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్వూటివ్ ఇంజినీరు శంకరరావు, ఎఫ్‌ఏసీ తిరుపతి రావు, సభ్యురాలు ఉష బుధవారం ద్రవిడ వర్శిటీలో పర్యటించారు. వర్శిటీ వీసీ ఎల్‌సీ మల్లయ్య అధ్యక్షతన జరిగిన మానిటరింగ్ సమావేశంలో సభ్యులు అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 20 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న జీ ఫ్లస్ 2 తరగతి గదుల సముదాయం, పురుషుల వసతి గృహం, హరప్ప భవనం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత, పారద్శకత ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్ ఉన్నారు.


