పీఎన్‌జీ కనెక్షన్ల విస్తరణకు సమగ్ర సర్వే | - | Sakshi
Sakshi News home page

పీఎన్‌జీ కనెక్షన్ల విస్తరణకు సమగ్ర సర్వే

Jul 18 2026 3:23 AM | Updated on Jul 18 2026 3:23 AM

● ప్రారంభ రుసుం విడతల ● జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌

వారీగా చెల్లించేలా ప్రతిపాదనలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో గృహ, వాణిజ్య వినియోగదారులకు పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) కనెక్షన్ల విస్తరణకు సమగ్ర సర్వే నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పర్యావరణహితమైన, సురక్షితమైన పీఎన్‌జీ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు, వాణిజ్య సంస్థలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పీఎన్‌జీ కనెక్షన్లు పొందేందుకు ఆసక్తి చూపే గృహాలు, వాణిజ్య సంస్థలను గుర్తించేందుకు మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా పీడీ సంయుక్తంగా సమగ్ర సర్వే చేపట్టాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా వార్డు, వీధి, పేరు, సంప్రదింపు వివరాలు, వినియోగదారుల కేటగిరీతో కూడిన నివేదికను సమర్పించాలన్నారు. గ్యాస్‌ ఎంత వినియోగిస్తే అంతే బిల్లు చెల్లించే విధానం పీఎన్‌జీలో ఉందన్నారు. ఈ సదుపాయంపై పీఎన్‌జీ సంస్థ ప్రతినిధులు వినియోగదారులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. కనెక్షన్‌ ఏర్పాటుకు చెల్లించాల్సిన ప్రారంభ రుసుంను భారం కాకుండా విడతల వారీగా చెల్లించేలా వీలు కల్పించాలని వాణిజ్య సంస్థల ప్రతినిధులు కోరగా, దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఎన్‌జీ సంస్థ ప్రతినిధులను జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జి డీఎస్‌వో లక్ష్మి, మెప్మా పీడీ శ్రీనివాసులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి గుణశేఖర్‌రెడ్డి, చిత్తూరు నగరపాలక అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శుభప్రద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement