అకౌంట్స్‌ ఆఫీసర్‌గా రమణారావ్‌ | - | Sakshi
Sakshi News home page

అకౌంట్స్‌ ఆఫీసర్‌గా రమణారావ్‌

Jul 18 2026 3:23 AM | Updated on Jul 18 2026 3:23 AM

● జిల్లాలో 202 మంది మెరిట్‌ విద్యార్థులకు నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు ● ఏర్పాట్లు చేస్తున్న విద్యా, సమగ్రశిక్ష శాఖ అధికారులు ● భక్తులకు ఇబ్బంది కలగకుండా సేవలందించండి ● కాణిపాకం ఈవో పెంచల కిషోర్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయం అకౌంట్స్‌ ఆఫీసర్‌గా రమణారావ్‌ శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు. ఈ మేర కు ఆయన జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఏపీసీ వెంకటరమణను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు చేపట్టారు. అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్రశిక్ష శాఖ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తానని చెప్పారు. ఆయన ను ఆ శాఖ సూపరింటెండెంట్‌ కుమార్‌, సిబ్బంది గుణ, సెక్టోరల్‌ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

20న షైనింగ్‌ స్టార్‌

అవార్డుల ప్రదానోత్సవం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈనెల 20 వ తేదీన షైనింగ్‌ స్టార్‌ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ వెల్లడించారు. శుక్రవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. మార్చి 2026 పబ్లిక్‌ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు జిల్లాస్థాయి షైనింగ్‌ స్టార్‌ అవార్డుల ప్ర ధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా 10వ తరగతిలో అత్యధిక మా ర్కులు సాధించిన 168మంది, ఇంటర్మీడియట్‌ లో 34 మంది మొత్తం 202 మందికి అవార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. పురస్కార గ్రహీతలకు ఒక ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పా టు రూ.20 వేల నగదు బహుమతిని చెక్కు రూ పంలో అందజేసి సత్కరించనున్నట్లు వెల్లడించారు.

భక్తులను గణేషా అని

సంభోధించాలి

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మెరుగైన సేవలు అందించాలని ఈవో పెంచల కిషోర్‌ స్పష్టంచేశారు. స్థానిక ఆలయ ఈఓ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం వివిధ విభాగాల సిబ్బంది, అర్చకులు, వేద పండితులతో ఆయన పర్యవేక్షక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులతో సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా క్యూ లైన్లలో విధులు నిర్వహించే సిబ్బంది భక్తులను గణేషా అని భక్తి భావంతో సంబోధిస్తూ ముందుకు సాగదీయాలని సూచించారు. నిత్య అన్న దాన ప్రసాద వితరణలో పనిచేసే సిబ్బంది భక్తులకు ఎంతో సహనంతో వడ్డించాలని చెప్పారు. అనంతరం వివిధ విభాగాల పనితీరుపై అర్చకు లు, వేద పండితులతో మాట్లాడి వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈవో సాగర్‌ బాబు, ఏఈఓలు ఎస్వీ కష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ, మాధవరెడ్డి, ప్రసాద్‌, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement