ప్రొటోకాల్ రద్దుచేసి పేదలకు స్వామివారి దర్శన కల్పించండి ఆ చానల్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది అబద్ధాలు అల్లి ప్రజలను మభ్యపెట్టడమే ‘పచ్చ’ చానల్ లక్ష్యం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆగ్రహం
కార్వేటినగరం: పవిత్రమైన కలియుగ శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళితే తనకు తీరని అవమానం జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆరోపించారు. పుత్తూరులోని వైఎస్సార్‌సీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు వేంకటేశ్వర స్వామివారి దర్శనంలో తీరని అవమానం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తీను తిరుమల వెళినప్పుడు తన లేఖలో తాను మాజీ ముఖ్యమంత్రి అని రాసి, తనకే దర్శనం అని ‘సెల్ఫ్’ అని కూడా రాశానన్నారు. అయినప్పటికీ తనను జనరల్ బ్రేక్ దర్శనం క్యూలో కూర్చోబెట్టారన్నారు. కనీసం తన దగ్గర పనిచేసిన వ్యక్తి తమ పిల్లలు బీటెక్ పాసయ్యారని స్వామివారి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి వారిని తనతో పాటు తీసుకెళ్లి హారతి సౌకర్యం ఇప్పించాని వెళితే తమకు హారతి కూడా రాకుండా చేశారని, భక్తుల ముందు సన్నిధిలోనే ఘోరంగా అవమానించారని అన్నారు.
ఆయన ప్రభుత్వ నాశనాన్ని
కోరుకుంటున్నారు
మహాభారంతో కౌరవుల నాశనాన్ని శకుని కోరుకున్నట్లు కూటమి ప్రభుత్వంనాశనాన్ని ‘పచ్చ’ చానల్ కోరుకుంటున్నారని విమర్శించారు. ఎప్పటికైనా బాబు ప్రభుత్వానికి ఆ చానల్ ఎసరు పెట్టడం ఖాయమన్నారు. ఇప్పిటికై నా అసత్యాలను రాయడం మానుకోవాలని హితవు పలికారు.
వక్రీకరించిన ఏబీఎన్ చానల్
తనకు జరిగిన అవమానాన్ని గురువారం స్వామివారి సన్నిధిలో మీడియాతో వెల్లడిస్తే దాన్ని కూడా ‘పచ్చ’ చానల్ వక్రీకరించి రాయడం బాధాకరమన్నారు. మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రొటోకాల్‌ను రద్దుచేసి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పినా.. దళితుడన్న ఉద్ధేశంతో తనను పవిత్రమైన స్వామివారి సన్నిధిలో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి కూడా ప్రొటోకాల్ పాటించామని, అయితే నేడు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ప్రొటోకాల్ విషయంలో ఘోరంగా అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


