సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగుల విభజన | - | Sakshi
Sakshi News home page

సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగుల విభజన

Jul 18 2026 3:23 AM | Updated on Jul 18 2026 3:23 AM

ముసాయిదా జాబితాలు సిద్ధం చేయాలి విభజన ప్రక్రియలో ఏ ఒక్క ఉద్యోగీ మిగిలిపోకూడదు ఈనెల 20 వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ సమావేశంలో డీఆర్వో మోహన్‌కుమార్‌ వెల్లడి

ఉద్యోగుల విభజన,ముఖ్యమైన గడువులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకుని ఉద్యోగుల విభజన చేపట్టాలని డీఆర్వో మోహన్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉద్యోగుల విభజన ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడు తూ ఉద్యోగుల విభజనకు సంబంధించిన ముసాయిదా జాబితాలను పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం ఆదేశించిన ఉద్యోగుల విభజన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా అమ లు చేయాలన్నారు. పాత జిల్లా కేడర్‌ నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లా, అనుబంధ జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌, అనుబంధ జోనల్‌లకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను దశలవారీగా, అత్యంత జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ప్రతి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, తుది కేడర్‌ బలాన్ని సమగ్రంగా పరిశీలించి, వివరాలను ఖరారు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఉద్యోగికీ సీనియారిటీ జాబితాలో చోటు కల్పించాలన్నారు. ఈ విభజన సమయంలో ఏ ఒక్క ఉద్యోగీ మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

కలెక్టరేట్‌కు 85 మంది

ఉద్యోగుల కొత్త కేడర్‌ బలం

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రతి కలెక్టరేట్‌ కార్యాలయంలో ఇకపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ నుంచి వాచ్‌మెన్‌ వరకు మొత్తం 85 మంది ఉద్యోగులు పనిచేసేలా ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసిందని డీఆర్వో తెలిపారు. కలెక్టరేట్‌లో డీఆర్వో, కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌, భూ సంస్కరణల పాలనాధికారి, నలుగురు తహశీల్దార్‌ కేడర్‌ అధికారులు ఉంటారు. 16 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 16 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 10మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు, 16 మంది ఆఫీస్‌ సబార్డినేట్లు, నలుగురు డ్రైవర్లు, ఇద్దరు వాచ్‌మన్లు, ఒక రికార్డు అసిస్టెంట్‌, ఒక జమేదార్‌ ఉంటారన్నారు.ఇప్పటివరకు కలెక్టరేట్‌ అవసరాల కోసం మండలాల నుంచి డీటీలను డిప్యూటేషన్‌పై తీసుకువచ్చేవారని, ఇకపై 16 మంది డీటీలను కలెక్టరేట్‌కు ప్రత్యేకంగా కేటాయించారని తెలిపారు. తహసీల్దార్ల పోస్టులను మల్టీ జోన్‌ (జోన్‌ 1, 2 కలిపి) గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను చిత్తూ రు, తిరుపతి, అన్నమయ్య మూడు జిల్లాల పరిధిలో చేపడుతున్నట్లు డీఆర్వో తెలిపారు. జూలై 20 (సోమవారం) ఆయా శాఖల కార్యాలయాల్లో ప్రదర్శించిన ముసాయిదా జాబితాలపై ఉద్యోగుల నుండి అభ్యంతరా ల స్వీకరణకు ఆఖరి గడువు ఉంటుందన్నా రు. జూలై 22 (బుధవారం) అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది సీనియారిటీ జాబితా విడుదల చేస్తారన్నారు. జూలై 26 (ఆదివారం) ఉద్యోగుల నుంచి ఆప్షన్‌ ఫారా ల స్వీకరణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో ప్రతి ఉద్యోగికి మూ డు ఆప్షన్లు ఇస్తారన్నారు. కేటాయింపు సమ యంలో సదరు పోస్టుకు ఎవరూ పోటీ పడకపోతే ఉద్యోగి కోరుకున్న చోటుకే బదిలీ చేస్తారన్నారు. ఒకవేళ ఒకే పోస్టుకు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే, సీనియారిటీ జాబితాను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరుపుతారన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వచ్చే నెల ఆగస్టు 5వ తేదీ లోగా పూర్తి చేయడానికి అవకాశం కల్పించినట్లు డీఆర్వో వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement