13న ఐటీఐలో అప్రెంటీస్‌షిప్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

13న ఐటీఐలో అప్రెంటీస్‌షిప్‌ మేళా

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

● తిరుపతి జూ నుంచి గణేష్‌ అనే గజరాజు రాక ● ఇక్కడున్న కుంకీలతో ఒంటరి ఏనుగుకు కళ్లెం ● ఖాళీగా ఉన్న 3 సీట్లకు అవకాశం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 13 వ తేదీన అప్రెంటీస్‌షిప్‌ మేళా నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ మేళాను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 13 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో హాజరుకావాలన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్య ర్థులు ముందుగా అప్రెంటిస్‌షిప్‌ అధికారిక పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఒకవేళ పోర్టల్‌లో నమోదు చేసుకోని పక్షంలో, అభ్యర్థులు తమ విద్యార్హత సర్టి ఫికెట్లతో నేరుగా ఐటీఐ కార్యాలయానికి రావొచ్చన్నారు.

ఉచిత పంట బీమాకు అవకాశం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జిల్లాలోని చిత్తూరు డివిజన్‌ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 ఖరీఫ్‌ సీజన్‌కు గాను వరి, రాగి, కందు లు, వేరుశెనగ పంటలకు ఉచిత పంట బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చిత్తూరు డివిజన్‌ పరిధిలోని చిత్తూరు, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, పూతలపట్టు,ఐరాల, పెనుమూ రు, తవణంపల్లె, వెదురుకుప్పం, కార్వేటినగరం, రొంపిచర్ల, పులిచెర్ల మండలాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసా య శాఖ అధికారులు కోరారు. ఆయా పంటల వారీగా నిర్ణీత ప్రీమియం చెల్లించి గడువులోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

మదపుటేనుగును

బంధించేందుకు చర్యలు

పలమనేరు: పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్‌లో చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ సంచరిస్తున్న ఒంటరి మదపుటేనుగుకు బంధించి దాన్ని కుంకీగా మార్చేందుకు స్థానిక అటవీశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇక్కడి ఎలిఫెంట్‌ క్యాంపులోని దేవా అనే ఏనుగును తిరుపతి జూకు అప్పగించి జూలోని గణేష్‌ అనే ఏనుగును ఇక్కడి ముసలిమొడుగు క్యాంపునకు రప్పిస్తున్నారు. ఇక్కడున్న కుంకీలతో గణేష్‌ను కలుపుకుని ఓ ఆపరేషన్‌ చేయించనున్నట్టు అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు మావటీల ద్వారా వీటికి శిక్షణ ఇచ్చి ఒంటరి ఏనుగు ను పట్టుకునేలా చర్యలు చేపట్టారు. అది చిక్కితే దానికి శిక్షణ ఇచ్చి కుంకీగా మార్చనున్నారు.

కేంద్రీయ విద్యాలయాల్లో

5వ తరగతి అడ్మిషన్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలో ఇరువారం వద్ద ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా 5 వ తరగతి అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5 వ తరగతిలో ఖాళీగా ఉన్న మూడు సీట్లకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఏప్రిల్‌ 1 వ తేదీ 2014 నుంచి ఏప్రిల్‌ 1 వ తేదీ 2016 లోపు జన్మించిన వారై ఉండాలన్నారు. కేంద్రీయ విద్యాలయ నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయిస్తారన్నారు. దరఖాస్తు ఫారాలను పాఠశాలలో ఉచితంగా స్వీకరించి ఈనెల 18 వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని ఆయన కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

కుప్పం: మండల పరిధిలోని గణేష్‌పురం వద్ద ఉన్న మహాత్మా జ్యోతీరావ్‌ పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రాయకృష్ణ శుక్రవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. ఈ పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో బీస్సీ, ఎస్సీ విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి సోమవారం వర కు పాఠశాలలో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న సీట్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15 వతేది ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు కోసం 9985609713, 8185847668 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

టెంపో ఢీకొని యువకుడి మృతి

బంగారుపాళెం: మండలంలోని నలగాంపల్లె వద్ద శుక్రవారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని టెంపో ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపాల మండలం పాపసముద్రం గ్రామానికి చెందిన కుశాల్‌(20) సొంత పని నిమిత్తం బెంగళూరుకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. గురువారం రాత్రి 11 గంటలకు బెంగళూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గం మధ్యలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలగాంపల్లె ఐఓసీ పెట్రోల్‌ బంక్‌ వద్ద టెంపో ఢీకొంది. ఈ ప్రమాదంలో కుశాల్‌ అక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement