
నూతన సీఐ మురళీమోహన్
బదిలీ అయిన సీఐ నరసింహరాజు
పలమనేరు: పలమనేరు సీఐ నరసింహరాజును వీఆర్ బదిలీ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు నుంచి బుధవారం ఆదేశాలందాయి. ఆయన స్థానంలో గంగవరం రూరల్ సీఐగా ఉన్న మురళీమోహన్ ఇక్కడికి సీఐగా గురువారం విధుల్లో చేరారు. కాగా సౌమ్యుడిగా పేరున్న నరసింహరాజు బదిలీపై పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే గతంలో జరిగిన కనగదుర్గ ఫైనాన్స్ మోసం కేసులో కొందరు నిందితులకు ఆయన సాయం చేశారనే విషయం నిఘా వర్గాల ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు వెళ్లిందనే విషయం తెలిసింది. మరోవైపు ఆయన అధికారపార్టీకి పెద్దగా సపోర్ట్ చేయనందుకే బదిలీ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేదింటి బిడ్డ ప్రతిభ
నిండ్ర: ఓ పేదింటి బిడ్డ నీట్‌లో ప్రతిభ చూపి, తి రుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. ఇటీవల విడుదలైన నీట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎంబీబీఎస్‌లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిండ్ర మండలం కొప్పేడు దళితవాడకు చెందిన చిట్టిబాబు, నిశాంతి దంపతుల కుమార్తె టినారాణి నీట్‌లో 480 మార్కులు సాధించి, 2,368 ర్యాక్ తెచ్చుకుంది. దీంతో ఆమెకు ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్‌లో తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. దీంతో ఆ విద్యార్థిని పలువురు ప్రశంసించారు.