
అమరవీరుల స్ఫూర్తితో పోరాడుతాం
– స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి
చిత్తూరు కార్పొరేషన్: అమరువీరుల స్ఫూర్తితో ముందుకు వెళదామని సీపీఐ, సీపీఎం నాయకులు తెలిపారు. గురువారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులనివార్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీల జిల్లా కార్యదర్శులు నాగరాజు, గంగరాజు మాట్లాడారు. గతంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ నివాళులర్పించారు. పోరాట స్ఫూర్తితో నేటి విద్యుత్ భారాలకు, స్మార్ట్ మీటర్లకు, సర్దుబాటు చార్జీలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో నాయకులు రమాదేవి, కుమారి, విజయ, ఆనంద్, శివకుమార్, మురుగన్ తదితరులు పాల్గొన్నారు.