పెళ్లి సంబంధం చూడడానికి వెళుతూ.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి సంబంధం చూడడానికి వెళుతూ..

Aug 29 2025 2:38 AM | Updated on Aug 29 2025 6:39 AM

పెళ్ల

పెళ్లి సంబంధం చూడడానికి వెళుతూ..

● డివైడర్‌ను ఢీకొట్టిన కారు ● తండ్రీకుమారులు మృతి ● మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు

పూతలపట్టు(యాదమరి): కుమారునికి వివాహం సంబంధం చూడటానికి వెళుతున్న తండ్రీకుమారులను మృత్యుదేవత రోడ్డు ప్రమాదం రూపంలో పంజా విసిరిన ఘటన పూతలపట్టులో చోటుచేసుకుంది. సీఐ కృష్ణమోహన్‌ కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన సుబ్బారాయుడు(60) కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే వ్యాపారరీత్యా బెంగళూరు నగరంలో స్థిరపడింది. అయితే తన కుమారుడు నాగేంద్ర(30)కు వివాహం చేయాలన్న ఆలోచనతో పెళ్లి సంబంధాలు చూసే ప్రయత్నం మొదలుపెట్టారు. 

ఈ నేపథ్యంలో తమ స్వస్థలమైన నెల్లూరు కు సుబ్బరాయుడితోపాటు ఆయన భార్య మంగమ్మ(56), కుమారుడు నాగేంద్ర(30), కుమార్తె సుభాషిణి(36), మనుమడు లక్కి(7)తో కలిసి గురువారం ఉదయం బెంగళూరు నుంచి ఎర్టిగా కారులో బయలుదేరారు. కారు నడుపుతున్న నాగేంద్ర నిద్రమత్తులోకి జారుకోవడవంతో తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిలోని పూతలపట్టు మండలం గోపాలపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాల డెయిరీ వద్ద కల్వర్టును ఢీ కొన్నారు. కారు నడుపుతున్న నాగేంద్ర, పక్కసీటులో ఉన్న అతడి తండ్రి సుబ్బారాయుడు కల్వర్టు కింద పడి మరణించారు. 

కారు వెనుక భాగంలో కూర్చున్న సుబ్బారాయుడు భార్య, కూతురు, మనుమడు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ కృష్ణమోహన్‌ బృందం వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీసి 108 వాహనంలో పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సుభాషిణి ఆస్పత్రిలో తన తండ్రి, తమ్ముడికి ఏమైంది.. వారెక్కడ అని రోదిస్తూ అడగడం పలువురిని కంటతడి పెట్టించింది. మృతులను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ కృష్ణమోహన్‌ అన్నారు.

పెళ్లి సంబంధం చూడడానికి వెళుతూ.. 1
1/2

పెళ్లి సంబంధం చూడడానికి వెళుతూ..

పెళ్లి సంబంధం చూడడానికి వెళుతూ.. 2
2/2

పెళ్లి సంబంధం చూడడానికి వెళుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement