
త్వరలోనే బుద్ధి చెప్పేరోజులొస్తాయి
మిథున్‌రెడ్డి విడుదల కావాలని వీరాంజనేయస్వామి, శివాలయంలో పూజలు 301 టెంకాయలుకొట్టి పెద్దిరెడ్డి పేరిట అర్చన అధికసంఖ్యలో పూజలకు హాజరైన వైఎస్సార్ సీపీ శ్రేణులు
చౌడేపల్లె: కూటమి ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులొస్తాయని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. దామోదరరాజు, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జి.నాగభూషణరెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ హెచ్చరించారు. గురువారం వైఎస్సార్ సీపీ కాగతి పంచాయతీ నేతల ఆధ్వర్యంలో కరణంవారిపల్లె వద్ద ఉన్న వీరాంజనేయస్వామి ఆలయంలో అక్రమ కేసు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు చేశారు. 301 టెంకాయలు కొట్టి వీరాంజనేయా.. పెద్దిరెడ్డి కుటుంబానికి అభయమివ్వు అయ్యా.. కూటమి కుట్రలదారులకు మంచి బుద్ధి ప్రసాదించయ్యా అంటూ వేడుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరిట అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆడెం హరిబాబు, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, పార్టీ మండల ఉపాధ్యక్షులు వెంకటరమణ, లడ్డూ రమణ, అమర, సర్పంచ్ షంషీర్, డీసీసీబీ మాజీ డైరక్టర్ రమేష్, నాయకులు గంపల రామకృష్ణ, నారాయణరెడ్డి, నరేష్, గిరిబాబు, గణేష్, చెంగారెడ్డి, గంగిరెడ్డి, చిన్నప్ప, రాజారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో పూజలు
మండలకేంద్రంలోని బజారువీధిలో ఉన్న అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో గురువారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి కళ్యాణ్‌భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశా రు. మాజీ ఎంపీపీలు అంజిబాబు, రెడ్డిప్రకాష్, వైస్‌ఎంపీపీ నరసింహులు యాదవ్, పార్టీ నేతలతో కలిసి మిథున్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని కోరుతూ పూ జలు చేయించి ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొ ట్టి పూజలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబంపై అక్రమ కే సులు పెట్టి, ఎల్లో మీడియా ద్వారా కక్ష సాధింపు చర్య లు మానుకుని ప్రజలకిచ్చిన హామీలను అమలు చే యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, పవన్, హరీష్ పాల్గొన్నారు.