
ఏ నిమిషానికి ఏమి జరుగునో?
పేరుకే డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ
తుది సెలక్షన్ జాబితా వెల్లడించకుండా పరిశీలన
లోగుట్టు రహస్యాలపై పలు అనుమానాలు
1,478 మందికిగాను 1,099 మందికే కాల్‌లెటర్లు
కొంత మందికి కాల్‌లెటర్లు, మరికొంత మందికి మెసేజ్‌లు
మెగా డీఎస్సీ ప్రక్రియపై అభ్యర్థుల పెదవి విరుపు
డీఎస్సీ.. ఇది జిల్లాస్థాయికే పరిమితం.. అయితే ప్రస్తుత డీఎస్సీ రాష్ట్రస్థాయిలో సాగుతోంది. జిల్లాస్థాయిలో పారదర్శకంగా సాగాల్సిన ఈ ప్రక్రియను కూటమి సర్కారు పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియక, అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఫలితంగా వారు అర్హత సాధించిన అభ్యర్థులు సైతం ఆందోళన చెందాల్సి వస్తోంది.
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకుంది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై డీఎస్సీ అభ్యర్థుల్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. పారదర్శకంగా నిర్వహించాల్సిన డీఎస్సీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ప్రక్రియ మొత్తం రాష్ట్ర స్థాయిలో రహస్యంగా చేపడుతూ పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎస్సీ అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ. జిల్లాస్థాయి కమిటీలో చేపట్టాల్సిన ఎంపిక ప్రక్రియను కూటమి ప్రభుత్వం రహస్యంగా రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న డీఎ స్సీ ప్రక్రియ నిబంధనలకు ప్రస్తుతం తూట్లు పొడిచింది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న మెగా డీఎస్సీ ప్ర క్రియపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డీఎస్సీ పరీక్షలు రాసి ఎంపికై న అభ్యర్థులకు గురువారం సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రక్రియను చిత్తూరు జిల్లా కేంద్రం సరిహద్దులో ఉన్న అపోలో యూనివర్సిటీ, ఆర్‌వీఎస్ నగర్‌లో ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ ప్రక్రియ గురువారం రాత్రి వరకు 50 శాతం పూర్తి కాని పరిస్థితి నెలకొంది.
మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ
కూటమి ప్రభుత్వం చేపట్టింది మెగా డీఎస్సీ కాదు..దగా డీఎస్సీ అని విద్యావేత్తలు, అభ్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. డీఎస్సీ అంటేనే డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ అని అర్థం ఉంది. అయితే ఆ అర్థానికి కూటమి ప్రభు త్వం తిలోదకాలు పలికింది. జిల్లా స్థాయిలో కమిటీగా ఏర్పడి నిర్వహించాల్సిన ఎంపిక ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తోంది. ఎన్నడూ ఇలా జరగలేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో జాబితాలు మొత్తం సిద్ధం చేస్తుండడంతో పలు అనుమానా లు తలెత్తుతున్నట్లు వాపోతున్నారు. పూర్తిస్థాయిలో స్ప ష్టంగా తుది ఎంపిక జాబితాలు ప్రచురించకపోవడంపై ఆంతర్యమేమిటో తెలియజేయాలని అభ్యర్థులు డి మాండ్ చేస్తున్నారు. కూటమికి అనుకూలమైన అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ఇలాంటి లోగుట్టు ప్రక్రి య చేపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
1,478 మందికి గాను 1,099 మందికే..
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1,478 మందికి గాను 1,099 మందికి మాత్రమే కాల్‌లెటర్లు పంపి గురువారం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసుకున్నంత మాత్రం ఉద్యోగం వచ్చినట్టు కాద నే మెలిక పెట్టారు. అలాగే తుది ఎంపిక జాబితాను ప్రచురించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెల కొంది. 379 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు రాక పోవడంతో ఆందోళనతో సర్టిఫికెట్ పరిశీలన కేంద్రాలకు విచ్చేశారు. అనంతరం మిగిలిన 379 మందికి త్వరలో కాల్‌లెటర్లు పంపుతారని అధికారులు సమాధానమిచ్చారు. సాయంత్రం వరకు కేంద్రాల వద్ద పడిగాపులు కాసి అభ్యర్థులు చేసేదేమి లేక వెనుదిరిగారు. కొంత మందికి కాల్‌లెటర్లు, మరికొంత మందికి మెసేజ్‌లు పంపడంతో గందరగోళం నెలకుంది.
అర్ధరాత్రి వరకు పడిగాపులు
కూటమి ప్రభుత్వం అలసత్వ వైఖరితో డీఎస్సీ అభ్యర్థులు గురువారం పరిశీలన కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ముందస్తుగా సెలక్షన్ జాబితాను పారదర్శకంగా ప్రచురించి సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సింది పోయి ఎలాంటి జా బితా ప్రచురించకుండా పరిశీలన చేపట్టారు. ఇదేమిటని పలువురు సంఘ నేతలు రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇందుకు రాష్ట్రస్థాయి అధికారు లు పరిశీలన ప్రక్రియ తాత్కాలికం మాత్రమేనని చెప్ప డం కొసమెరుపు. గతంలో ఎంపిక జాబితాను ప త్రికలకు వెల్లడించేవారు. అయితే ప్రస్తుతం అభ్యర్థుల వ్య క్తిగత లాగిన్‌లకే పంపి గందరగోళానికి తెరలేపారు. గురువారం సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాల్లో పలు సమస్యలు చోటు చేసుకున్నాయి. చిన్న చిన్న తప్పిదాలు, అవగాహన లేక కొంత మంది అభ్యర్థులు అర్హులైనప్పటికీ తప్పుగా ఒక సర్టిఫికెట్ బదులు మరో సర్టిఫికెట్ అప్‌లోడ్ చేశారు. అటువంటి అభ్యర్థుల స మస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే జిల్లా అధికారులు పరిష్కారం తమ చేతుల్లో లేదని చేతులెత్తేశారు. సర్వర్ మొరాయింపుతో గురువారం రాత్రి 8 గంటల వరకు 51 శాతమే పరిశీలన పూర్తి అయ్యింది. ఈ ప్ర క్రియ అర్ధరాత్రి వరకు కొనసాగే పరిస్థితి ఉండడంతో దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన అభ్యర్థులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
అంతా గందరగోళమే