
అధ్వాన్న రోడ్లు
వర్షాలొస్తే అంతే!
పుంగనూరు: వర్షాలు వస్తే పుంగనూరు–శంకర్రాయలపేట రోడ్డులో ప్రయాణం నరకప్రాయమవుతోంది. పుంగనూరు నుంచి పుంగమ్మ చెరువు కట్టమీదుగా శంకర్రాయలపేట, బెంగళూరుకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి రహదారి దుస్థితికి చేరినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కుప్పం: కుప్పం ప్రాంతంలో చిరుజల్లులకే గ్రామీణ రహదారులు బురదమయమయ్యాయి. మండలంలోని ఊరినాయనిపల్లె కొత్తూరుకు వెళ్లే మార్గం గుంతలమయంగా మారింది. 40 ఏళ్లుగా గ్రామస్తులు రోడ్డు కోసం పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పొలాల్లో ఉన్న రోడ్లు వర్షాలొస్తే రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నోసార్లు అధికారులు, నాయకులను కోరినా పట్టించుకున్న పాపానపోవడం లేదని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
గంగవరం: మండలంలో ప్రధానంగా శ్రీకోనేటిరాయస్వామి ఆలయం ఉన్న కీలపట్ల రోడ్డు అధ్వాన్నంగా మారింది. హైవే ఆనుకుని కీలపట్లకు ఉన్న అనుసంధాన రోడ్డు బురదమయమైంది. ఇక గంగవరం ఫ్లైఓవర్ వద్ద హైవేపై వర్షం కారణంగా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఫ్లైఓవర్ చుట్టూ ఇదే పరిస్థితి.
గుంతలు పూడ్చండి మహాప్రభో!

అధ్వాన్న రోడ్లు

అధ్వాన్న రోడ్లు

అధ్వాన్న రోడ్లు