
సబ్సిడీ వివరాలు సరిచూసుకోండి
గుడిపాల: మామిడి సబ్సిడీకి సంబంధించి రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణా తెలిపారు. గురువారం బసవాపల్లెలో మామిడి సబ్సిడీకి సంబంధించి రైతులతో గ్రామసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫ్యా క్టరీలకు మామిడి కాయలు తోలిన రైతులు మరొకసారి వారి బ్యాంక్ ఖాతాలను సరిచూసుకోవాలన్నారు. రైతుల సమక్షంలో వారి వివరాలను సచివాలయం వద్ద అతికించారు. అనంతరం పొలం పిలుస్తుందిలో భాగంగా చెరుకు, వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. వ్యవసాయాధికారి సంగీత, అగ్రికల్చర్ అసిస్టెంట్ యోగప్రియ, శ్రీకాంత్ పాల్గొన్నారు.