
డ్రోన్‌తో పేకాటరాయుళ్ల వేట!
– రూ.13,890 నగదు, సెల్‌ఫోన్లు, 2 బైక్‌లు సీజ్
రొంపిచెర్ల: పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రోన్ కెమెరాతో దాడి చేసి జూదరులను పట్టుకున్న సంఘటన కల్లూరు సర్కిల్ పరిధిలోని రొంపిచెర్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ సీఐ సూర్యనారాయణ కథనం..గానుగచింత గ్రామ పంచాయతీలోని జగడంవారిపల్లె అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని స్థానిక పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ రంగంలోకి దిగారు. చిత్తూరు నుంచి పోలీసు సిబ్బంది పక్కా వ్యూహంతో వచ్చారు. అయితే అటవీప్రాంతం కావడంతో జూదరులను పట్టుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. దీంతో డ్రోన్ కెమెరా సాయంతో మామిడి తోటలో జూదం ఆడుతున్న వారిని గుర్తించారు. దాడి చేసి గానుగచింత నగిరికి చెందిన ఎస్.మురళి(44), జి.రెడ్డి ప్రసాద్ (34) (జగడంవారిపల్లె), ఏ.విశ్వనాథ (45), (చంద్రగిరి), ఎన్.షౌకత్‌అలీ (44) (పెద్దమల్లెల కస్పా), ఏ.ఆనంద్(31) (కేవీపల్లె), కె.రమణారెడ్డి (63) (కాకులారంపల్లె), ముప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన కె.రెడ్డెప్ప (45)ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ13,890 నగదు, 7 సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

డ్రోన్‌తో పేకాటరాయుళ్ల వేట!