
పాలక మండలి పదవులకు 57 దరఖాస్తులు
చౌడేపల్లె: జిల్లాలో రెండవ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ నూతన పాలక మండలి పదవుల నియామకానికి మొత్తం 57 మంది దరఖాస్తులు చేశారని ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. గురువారం పుంగనూరు మండలం ఇటికినెల్లూరుకు చెందిన ఎస్‌కె. రమణారెడ్డి, ఆయన సతీమణి రతీదేవి, కుమారుడు రాజశేఖర్‌రెడ్డితోపాటు మరో 33 మంది సభ్యులు దరఖాస్తులను కూటమి నేతలతో కలిసి ఈఓకు అందజేశారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. ఎస్‌కె రమణారెడ్డి, రతీదేవి గతంలో బోయకొండ ఆలయ పాలక మండలి చైర్మన్లుగా పనిచేశారు. మరోసారి చైర్మన్ బరిలో దిగారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్, సోమల సురేష్, యధుశేఖర్ నాయుడు, ఆసూరి బాలాజీ, కృష్ణంనాయుడు, కృష్ణానాయక్, బల్లాపురం నరేష్, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.