
డైట్ కళశాలలో విద్యుత్ చౌర్యం
కార్వేటినగరం: డైట్ కళాశాలలో ఓ అధ్యాపకుడు విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. డైట్ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడికి ఎలక్ట్రిక్ కారు ఉంది. గత కొన్ని రోజులుగా అతను సమీపంలో ఉన్న వసతి గృహం నుంచి కారుకు చార్జింగ్ చేసేవాడు. గుర్తించిన విద్యార్థులు సదరు అధ్యాపకుడిని ప్రశ్నించగా.. ఆయన పట్టించుకునేవారు కాదు. పైగా ప్రాక్టికల్ మార్కులు తన దగ్గరే ఉన్నాయని, ఎవరికై నా చెబితే తగ్గించేస్థానని ఛాత్రోపాధ్యాయులను బెదిరించేవాడు. ఈ క్రమంలో తన కారుకు విద్యుత్ చార్జింగ్ చేస్తున్న వీడియో గురువారం హల్‌చల్ చేసింది. దీనిపై సంబంధిత విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.