
వరసిద్ధుడికి రూ.1.67 కోట్ల ఆదాయం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని హుండీ ద్వారా రూ.1,67,32,780 ఆదా యం ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధ వారం లెక్కించారు. ఈఓ పెంచల కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో బంగారం 50 గ్రాములు, వెండి 1.617 కిలోలు వచ్చిందని ఈఓ పేర్కొన్నారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.16,236, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.41,450 వచ్చిందన్నారు. యూఎస్‌ఏ డాలర్లు 397, సింగపూర్ డాలర్లు 5, మలేషియా రింగిట్స్ 1, యూఏఈ దిర్హామ్స్ 230, కెనడా డాలర్లు 105, ఆస్ట్రేలియాడాలర్లు 70, యూరో దేశానికి చెందిన 325 యూరోలు, ఇంగ్లాడ్ 10 పౌండ్స్ వచ్చాయ న్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సాగర్‌బాబు, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, సుబ్రమణ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
డీవార్మింగ్ 99.81 శాతం పూర్తి
చిత్తూరు అర్బన్(కాణిపాకం): నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ (డీవార్మింగ్ కార్యక్రమం) 99.81 శాతం పూర్తి చేసినట్లు ఇన్‌చార్జ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి మా త్రల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామన్నారు. జిల్లాలో 3,61,848 పిల్లలుంటే ఇప్పటి వరకు 3,61,848 మంది పిల్లలకు మాత్రలు అందజేశామని ఆయన పేర్కొన్నారు.
అడ్మిషన్లు పరిమితికి
మించితే చర్యలు తప్పవు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుంటే చర్యలు తప్పవని ఇంటర్మీడియట్ డీఐఈఓ రఘుపతి హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు కచ్చితంగా ఇంటర్మీడియ ట్ బోర్డు నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కళాశాలల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, ఎంసెట్ మెటీరియల్‌ను పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని 31 ప్రభుత్వ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం 3,970 అడ్మిషన్లు, 98 ప్రైవేట్ కళాశాలల్లో 11,042 మొత్తం 15,012 అడ్మిషన్లు జరిగినట్లు తెలిపారు. గత విద్యాసంవత్సరం కంటే అడ్మిషన్లు మెరుగుపడ్డాయన్నారు. ఈ నెల 31 వ తేదీ వరకు ఆన్‌టీసీ అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 వరకు మూతపడిన కళాశాలలున్నట్లు తెలిపారు. ఆ కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీఐఈఓ వెల్లడించారు.

వరసిద్ధుడికి రూ.1.67 కోట్ల ఆదాయం