
● ఆచార్య మోతోభవ!
మాతృదేవోభవ..పితృదేవోభవ.. అమ్మానాన్నలు దేవుళ్లతో సమానం.. ఆ తరువాతి స్థానం ఆచార్యుడిదే. అందుకే ఆచార్యదేవోభవ అని గురువులను వేనోళ్ల కీర్తిస్తారు. ఇదీ మన భారతీయ సంప్రదాయంలో గురువుకున్న విలువ. అలాంటి స్థానంలో నిలిచిన గురువులను కూటమి సర్కారు కూలీల కింద లెక్క కట్టింది. పుస్తకాలు మోత భారం ఉపాధ్యాయులపై మోపింది. విధిలేక.. ఉద్యోగం వదులుకోలేక.. కొందరు ఉపాధ్యాయులు పుస్తకాలను నెత్తిపై పెట్టుకుని మోశారు. తమది కానీ ధర్మం నెరవేర్చారు. ఈ చిత్రం చూస్తే కూటమి ప్రభుత్వం గురువులకు ఏ పాటి స్థానం ఇస్తుందన్న విషయం తేట తెల్లమవుతోంది. గత ఎన్నికల్లో టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. గౌరవ ప్రధమైన వృత్తిలో ఉండే ఉపాధ్యాయులు చంద్రబాబు జమానాలో దినసరి కూలీల అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. టీచర్లపై ఈ సర్కారు ఎలాంటి ఒత్తిడి మోపుతుందనడానికి ఓ ఉపాధ్యాయుడు నెత్తిపై పుస్తకాల కట్ట, భుజం మీద, చేతిలో మరో పుస్తకాల కట్టలను మోస్తున్న చిత్రమే నిదర్శనం. ఈ చిత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
– చిత్తూరు కలెక్టరేట్