
మమ్మేల్‌మురుగన్!
హరోహర నామస్మరణతో మార్మోగిన గుడివంక
పోటెత్తిన భక్తులు
కిటకిటలాడిన పశ్చిమ వాహిని కొండ
గుడుపల్లె: గుడివంక శ్రీవళ్లీదేవ సేన సమేత సుబ్రమణ్యస్వామి కొండ హారోహర.. వేల్ మురుగా.. నామస్మరణంతో మార్మోగింది. శనివారం ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. కావళ్లు ఎత్తుకుని పశ్చిమ వాహినిలో స్నానాలు ఆచారించారు. అనంతరం స్వామి వారి నామస్మరణతో పశ్చిమ వాహిని కొండపైకి చెరుకున్నారు. కావళ్లను ఎత్తుకుని ఆలయం చట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు.
వివిధ ఆకృతులతో కావళ్ల చెలింపు
కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామి వారికి పలు ఆకృతులతో కావళ్ల ద్వారా మొక్కులు చెల్లించారు. తేరు కావళ్లు, రాగి గుండులు, ఇనుప శూలాలు, నిమ్మకాయలతో సూదులు శరీరానికి గుచ్చుకుని ఆలయం ఎదుట కావళ్లు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కొంత మంది భక్తులు ఎస్కాట్ వాహనంపై వీపుకు కొక్కిళ్లు వేసుకుని వెలాడుతూ వేల్ మురుగా అంటూ నినాదాలు చేస్తూ ఆలయం చట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.
గుడివంకలో జన సందడి
ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామి వారిని దర్శర్శించుకునేందుకు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం కనిపించింది. పశ్చిమ వాహిని నుంచి ఆలయం వరకు డప్పు వాయిద్యాల నడుమ కావళ్లు ఎత్తుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రత్యేక అలంకరణంతో గంగాధరేశ్వరస్వామి
గుడివంక బ్రహ్మోత్సవాల సందర్భంగా గంగాధరేశ్వరస్వామిని ప్రత్యేక ఆలంకరణంతో భక్తులకు దర్శనం కల్పించారు. కొండపై సుబ్రమణ్య స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో భక్తులు గంగాధరేశ్వరస్వామిని దర్శించుకుని గ్రామాలకు తిరుగుప్రయాణమయ్యారు.
తేరు కావళ్లతో భక్తుల సందడి
శూలాలతో వస్తున్న భక్తులు
ఆలయం వద్ద మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
దర్శనం కోసం క్యూలో కిక్కిరిసిన భక్తులు

మమ్మేల్‌మురుగన్!

మమ్మేల్‌మురుగన్!

మమ్మేల్‌మురుగన్!

మమ్మేల్‌మురుగన్!

మమ్మేల్‌మురుగన్!