చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్ పరీక్షలు ఈనెల 15వ తేదీతో ముగిశాయి. ఈక్రమంలో మూల్యాంకన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంపిక చేశారు. ఈ ఏర్పాట్లను డీవీఈఓ సయ్యద్ మౌలా పర్యవేక్షించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 1,33 లక్షల ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు జిల్లాకు చేరాయి. వీటిని పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా వివిధ జూనియర్ కళాశాలల్లో అనుభవం ఉన్న 510 మంది అధ్యాపకులను మూల్యాంకన విధులకు నియమించారు. ఈనెల 31వ తేదీలోపు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు.
సెల్‌ఫోన్‌లు వినియోగించొద్దు
పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళా శాలలో ఇంటర్ మూల్యాంకన ప్ర క్రియ నిర్వహించనున్నాం. ఇందు కు అవసరమైన అన్ని కేడర్‌లలో సి బ్బందిని నియమించాం. విధుల్లో ఉన్న సిబ్బంది సె ల్‌ఫోన్‌లు వినియోగించడానికి వీల్లేదు.
– సయ్యద్ మౌలా, జిల్లా ఇంటర్మీడియట్ డీవీఈఓ
నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం


