
యూజర్లు పౌష్టికాహారాన్ని అన్వేషించడానికి, ఆర్డర్ చేయడానికి వీలుగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో తమ యాప్‌లో కొత్తగా ‘హెల్దీ మోడ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి గురుగ్రామ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉందని, త్వరలో మిగతా మార్కెట్లలోనూ ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది.
మెట్రో నగరాల్లోని 18–45 ఏళ్ల వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. భాగస్వామ్య రెస్టారెంట్లు ఇచ్చే వివరాలను బట్టి ఒక్కో వంటకానికి ‘కనిష్టం’ నుంచి ‘సూపర్’ వరకు ‘హెల్దీ స్కోరు’ ఉంటుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఈ ఫీచరులో మార్పులు, చేర్పులకు సంబంధించి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని యూజర్లను కోరారు.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ రూటెటు..?