Yamaha R15 V4 Dark Knight Edition Launched; Check Price, Features, Engine Details - Sakshi
Sakshi News home page

Yamaha YZF-R15 V4: భారత్‌లో యమహా డార్క్ నైట్ ఎడిషన్ లాంచ్ - ధర & వివరాలు

May 23 2023 10:16 AM | Updated on May 23 2023 10:35 AM

Yamaha r15 v4 dark knight edition launched price features engine details and photos - Sakshi

Yamaha YZF-R15 V4 Dark Knight Edition: భారతదేశంలో యమహా బైకులకున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మార్కెట్లో తనదైన రీతిలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ తాజాగా మరో బైకుని లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు 'వైజెడ్ఎఫ్-ఆర్15 వి4' (YZF-R15 V4) డార్క్ నైట్ ఎడిషన్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & కలర్ ఆప్షన్స్
కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కలర్ ఆప్షన్‌ని బతి ధరలు కూడా మారుతూ ఉంటాయి. వైజెడ్ఎఫ్-ఆర్15 రెడ్ కలర్ ధర రూ. 1.18 లక్షలు, డార్క్ నైట్ ధర రూ. 1.82 లక్షలు, బ్లూ అండ్ ఇంటెన్సిటీ వైట్ ధరలు రూ. 1.86 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ చూడటానికి దాదాపు బ్లాక్ కలర్ పొందుతుంది. అయితే ఇందులో లోగోలు, అల్లాయ్ వీల్స్ వంటివి గోల్డ్ హైలైట్‌లను పొందుతాయి. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి.

(ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్‌జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!)

ఇంజిన్
ఇంజిన్ కూడా స్టాండర్డ్ ఎడిషన్ బైక్‌తో సమానంగా ఉంటుంది. కావున అదే లిక్విడ్ కూల్డ్ 155 సీసీ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి 18.4 hp పవర్, 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

ప్రత్యర్థులు
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250, కెటిఎమ్ RC 200 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement